పారితోషికంలో మెగాస్టార్‌ స్టామినా
మెగాస్టార్‌ చిరంజీవి తొగు చిత్ర సీమలో తిరుగులేని హీరో. ఇప్పటికీ టాలీవుడ్‌ లో మకుటం లేని మహరాజుగా ..మెగా హీరోగా మెగొందుతున్న చిరు అదే క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. సినిమా పరంగా ఈ సారి వేగం పెంచిన మెగాస్టార్‌ రెమ్యునరేషన్‌ విషయంలో అందరికీ షాక్‌ మీద షాక్‌ను ఇస్తున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్ట్‌ ని అంగీకరిస్తూ అటు చిత్ర పరిశ్రమ వారిని ఆశ్చర్యపరుస్తున్నారు.
పారితోషికం విషయంలోనూ ఇండస్ట్రీ వర్గాతో పాటు అభిమానుల్ని విస్మయానికి గురిచేస్తున్నారు. ఏడాదికి ఒకే ఒక్క సినిమా అంటూ ప్రామిస్‌ చేసిన చిరు ప్రస్తుతం ఒక మూవీ అండర్‌ ప్రొడక్షన్‌ లో వుండగానే మరో రెండు చిత్రాల్ని లైన్‌ లో పెట్టేస్తున్నారు. ఖైదీ నం.150కి గాను రూ.40 కోట్లు పారితోషికం అందుకున్న చిరు తాజాగా నటిస్తున్న ఆచార్య చిత్రానికి 50 కోట్ల రూపాయు తీసుకుంటున్నట్టు తొస్తోంది.ఆచార్య తరువాత వెంటనే తమిళ హిట్‌ ఫిల్మ్‌ వేదాళం రీమేక్‌ లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి మెహెర్‌ రమేష్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై అనిల్‌ సుంకర ఈ యాక్షన్‌ డ్రామాని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి గాను చిరు రూ.60 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని ఇండ్రస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. చిరు సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసు వర్షం కురుస్తుంది కాబట్టి నిర్మాత కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.