Andhra PradeshEast GodavariNews

అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చంటిబాబు

అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చంటిబాబు
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : గండేపల్లి మండలం తాళ్ళురు గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయల పంచాయతీ రాజ్ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామంలో  రెండవ సెంటర్ అంగన్వాడి భవనాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా సందర్భముగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని దానిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల నుండి పౌష్టికాహారంతో పాటు మంచి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అలాగే శిధిలావస్థలో ఉన్న అంగనవాడి భవనాలను పునర్నిర్మించి అందముగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని వసతులు ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఏడు నెలల నుండి 6 సంవత్సరముల లోపు పిల్లలు పౌష్టిక ఆహారం అందించటం తో మూడు సంవత్సరముల నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు విద్యాబోధన చేయటం గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం అందించడం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగనవాడి కేంద్రాలు ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్సార్ పార్టీ అధ్యక్షుడు చలగల దొరబాబు, కందుల  చిట్టిబాబు జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఒబ్బిని సత్యనారాయణ,ఒబ్బిని వీరబాబు, గ్రామ సర్పంచ్ వీరబాబు వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఐ సి డి ఎస్  సి డి పి ఓ లక్ష్మి సూపర్వైజర్ నాగ పార్వతి ఇన్చార్జ్ కార్యకర్త వై వి లక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comment here