Andhra PradeshEast GodavariNews

అంగరలో ఎంపీటీసీ అడ్డాల కృతజ్ఞత ర్యాలీ

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:మండల పరిధి అంగరలో ఆదివారం వైసిపి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఎంపీటీసీ-1 గా గెలుపొందిన అడ్డాల శ్రీనివాసరావు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఆదరాభిమానాలు చూపిస్తూ గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించారన్నారు.తీన్మార్ డబ్బులతో బాణసంచా కాలుస్తూ ఊరేగింపు జరిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ(అబ్బు), ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, సర్పంచ్ వాసా కోటేశ్వరరావు,ఉప సర్పంచ్ యర్ర వీరన్న బాబు,  పడమర కండ్రిక గ్రామ కమిటీ అధ్యక్షులు కవల శ్రీను, వైసీపీ నాయకులు  పెద్దింశెట్టి అశిరబాబు,రేలంగి శ్రీనివాసు,శ్రీదేవి,పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here