Andhra PradeshEast GodavariNews

అక్కచెల్లెమ్మల ఆనందనమే సీఎం ఆనందం

అక్కచెల్లెమ్మల ఆనందనమే సీఎం ఆనందం
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం నారాయణ స్కూలు ఆవరణలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ…….
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : అక్కచెల్లెమ్మల ఆనందమే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆనందమని ప్రభుత్వ హామీల అమలు కమిటి చైర్మన్‌, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని నీలాద్రిపురం నారాయణ స్కూలులో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెండవ విడత రుణమాఫీ అమలు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో రూ.12వేల కోట్లు పైబడి అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేశారన్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం బాగుంటుందని భావించే వ్యక్తి సీఎం జగన్మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లోనూ, పదవుల్లోనూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందేవమన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అర్హత ప్రామాణికంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి.శేషులత, గ్రామ సర్పంచ్‌ రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, ఎంపీడీవో జివికె.మల్లిఖార్జునరావు, వైసీపీ మండల అధ్యక్షుడు వెలిశెట్టి నరేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్‌, దృశ్య, శ్రవణ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మానికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comment here