Andhra PradeshNews

అక్రమ కట్టడాలపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ కన్నెర్ర

అక్రమ కట్టడాలపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ కన్నెర్ర

-భూదేవి పేట లో కట్టడాలు స్థానిక  తహశీల్దారుకు కనిపించవా?
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:వసంతవాడ గ్రామంలో ఆదివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం రాష్ట్రా అధ్యక్షుడు కాకి.మధు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎల్ టీ అర్ కేసులు,ఏజెన్సీ హక్కుల చట్టాలు అమలుకు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.భూదేవి పేట గ్రామంలో గిరిజ నేతరులు గిరిజన చట్టాలను తుంగలో తొక్కి ,విచ్చల విడిగా బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ విషయం స్థానిక తహశీల్దార్ పట్టదా అని అన్నారు.ప్రతి రోజు ఇదే రహదారిపై వస్తూ పోతూ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు.ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చూద్దాం అని గిరిజన చట్టాలను అవహేళన చేస్తున్నారని దుయ్య బట్టారు. ఈ విషయమై కలెక్టర్ కు,రెవెన్యూ డివిజన్ అధికారికి,ట్రైబల్ కమిషనర్ లకు కంప్లైంట్ ఇస్తామని ఆయన అన్నారు.అలాగే శ్రీకాకుళం జిల్లా,తూర్పు గోదావరి జిల్లా ల్లో జరిగిన వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు గౌరి శంకర్, సోందే.మల్లయ్య,సరియం.రామకృష్ణ,సోదే. సీతా రామయ్య, సొందే.రమేష్,తెల్లం.లక్ష్మణ్, చింతా.వెంకన్న బాబు,వెంకటేష్,మోహన్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Comment here