Andhra PradeshEast GodavariNews

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమల దేవి పేట గ్రామంలో ఒక వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని సబ్ ఇన్స్పెక్టర్ ఎం కుటుంబ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం టి నర్సాపురం గ్రామానికి చెందిన బొడ్డపాటి పున్నయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు మొదటి భార్య దగ్గర శెట్టి వారి గూడెం లో నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన అన్నగారి కూతురి వద్దకు ఆదివారం తిరుమల దేవి పేట వెళ్లి మధ్యాహ్నం  భోజనం చేసి పడుకుని ఎంతసేపటికి నిద్రలోనుండి లేగకపోవడంతో అనుమానం వచ్చిన కూతురు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే తండ్రి మృతి చెందినట్లు గుర్తించి తమ్ముడు రమేష్ కు ఫోన్ చేసి తెలియపరచగా వెంటనే రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు తలిపారు.

Comment here