Andhra PradeshEast GodavariNews

అమ్మో గొయ్యి..

అమ్మో గొయ్యి..

* రోడ్లపై బైకు నడపాలంటే భయం
* గోకవరం లో కొన్ని చోట్ల ప్రమాదంగా మారిన రోడ్లు
* వాహనదారులను ఎవరు కాపాడుతారు
* అసలు సంబంధిత అధికారులు ఉన్నారా
* ఎందుకని రోడ్లు కోసం పట్టించుకోవడం లేదు
* రోజు వాహనాలు నడిపి ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారు
* ఎప్పుడు వాహనదారులకు మోక్షం

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలం లో రోజు ఎందరో ప్రజలు వ్యాపారాలు చేసుకుంటూ.. తమ బతుకు తెరువు కోసం మోటార్ వాహనాల పై మన్యం ప్రాంతాలలో పండిన కాయగూరలు మరి ఏ ఇతర వస్తువులైన తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. అంతేకాక మండలంలో ఇతర గ్రామాల నుండి  నిత్యావసర సరుకులు కొనుక్కోడానికి కుటుంబ సభ్యులతో వాహనాలపై వస్తూ ఉంటారు. వాహనాలు  గోతిలో పడి కింద పడిన అంత పని అవుతుంది. ఒకరికి అని కాదు ప్రతి వాళ్లకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ ప్రధాన రహదారులు దర్శనమిస్తున్నాయి, ఆదివారం వస్తే చెప్పనక్కర్లేదు ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి మన్యం వైపుకు  చూడ దగ్గ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన భద్రాచలం వెళ్లాలన్న ఇదే ప్రధాన రహదారి ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఇటు వైపు ఉన్నాయి. గోకవరం నుంచి ఫజూలాబాద్ కు వెళ్లే మార్గంమధ్యలో ఒక పెద్ద గొయ్యి పడింది. సుమారుగా ఇరవై రోజుల నుంచి ఈ రోడ్డు వైపు వాహనాలు నడిపే వారు భయపడుతున్నారు, ఊరి చివర కావడంతో విద్యుత్ దీపాలు లేక మరీ ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిత్యం రోడ్లపై నుండి ఎందరో ప్రభుత్వ ఉద్యోగస్తులు వెళుతూ ఉంటారు. ఇప్పటివరకు గొయ్యి కోసం ఎ ఉద్యోగి పట్టించుకోలేదు, సంబంధిత అధికారులు ఎందుకు వాహనదారుల గురించి ఆలోచించడం లేదు అనేది.. తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. గోకవరం నుంచి తప్పకుండా వైపు వెళ్లే మూడు కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి పూర్తిగా పాడైంది. గోకవరం నుంచి వీరలంకపల్లి గ్రామం వరకు నాలుగు కిలోమీటర్లు ప్రధాన రహదారి వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ఎలా ఒకచోట కాదు మండలంలో అన్ని చోట్ల రోడ్ల పరిస్థితి అద్వానంగా మారింది. రోడ్లపై వాహనాలు నడుపుతున్న వాహనదారులు..  రోజు ఏదో ఒక చోట ప్రమాదం బారిన పడుతున్నారు, వర్షం పడితే గోతులు కనపడక వాహనదారులు ప్రమాదం బారిన పడుతున్నారు, నూతన రోడ్లు నిర్మాణం లేకపోయినా, కనీస మరమ్మతు పనులను చేపట్టాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు,

Comment here