Andhra PradeshEast GodavariNews

*అమ్మ దయ ఉంటేఅన్నీ ఉన్నట్లే*

*అమ్మ దయ ఉంటేఅన్నీ ఉన్నట్లే*

*వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:*
*విజయ దుర్గా అమ్మ వారి దయుంటే అన్నీ ఉన్నట్లేనని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఉద్భోదించారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఐదవ రోజైన సోమవారం అమ్మవారిని ఉదయం అన్నపూర్ణాదేవి, సాయంత్రం మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు చీమల కొండ వీరావధాని, చీమలకొండశ్రీనివాస్ అవధాని, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర పండితులు అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర, సహస్రనామావళి తో పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పీఠంలో వేంచేసియున్న విజయ వెంకటేశ్వర స్వామి , భవానీ శంకర అష్టమ లింగేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి,దత్త, సాయి బాబా తదితర పరివార దేవతలకు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులనుద్దేశించి పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అన్నపూర్ణా దేవిని అర్చిస్తే లోకం పాడిపంటలతో సుభిక్షంగా ఉండి అన్నవస్తాలకు లోటుండదన్నారు. మహాలక్ష్మి అమ్మవారిని అర్చిస్తే అష్టైశ్వర్యాలు ,శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి వి బాపిరాజు ,గాదె సత్య వెంకట కామేశ్వరి, భాస్కర నారాయణ, పి సత్య కనకదుర్గ ,పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్, అన్నవరం దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు కందర్ప హనుమాన్ విజయదుర్గా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Comment here