Andhra PradeshEast GodavariNews

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సం అక్టోంబర్ 01 న జరపాలి

*ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సం అక్టోంబర్ 01 న జరపాలి.*
*శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలి.*
*కర్నూలులో తిరిగి రాజధాని ఏర్పాటు చేయాలి.*
*రాయలసీమ జాయింట్  యాక్షన్ కమిటి(ఆర్ జెఎసి) డిమాండ్.*
కర్నూల్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సం అక్టోంబర్ ఒకటి న అవతరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు కేక్ కట్ చేసి రాయలసీమ జెండాలతో ఆర్ జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా ఆర్ జెఎసి నాయకులు రవికుమార్,సీమకృష్ణ,వివినాయుడు,రంగమునాయుడు, అశోక్ మాట్లాడుతూ 1937 లో నవంబర్ 16 లో భాగంగా 1953 అక్టోంబర్ 01 న కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని,1956 నవంబర్ 01 న విశాలాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు.అయితే 2014 సంవత్సరంలో తెలంగాణ విడిపోయిన తరువాత యథావిధిగా 1953 అక్టోంబర్ 01 న ఆంధ్ర రాష్ట్రం చేరింది కనుక ఈ తేదినే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలన్నారు.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలు కృష్ణ,తుంగభద్ర నీళ్లలలో వాట తేల్చి రాయలసీమకు నీళ్లు నిధులు నియమకాలలో న్యాయం చేయాలన్నారు.వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి రాయలసీమలో ఇంత వరుకు ఒక్క పరిశ్రమ లేదా విద్యాసంస్థలు నెలకొల్పలేదన్నారు.అదే విధంగా రివర్స్ టెండర్ తో రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు.రాయలసీమ ఎత్తిపోతలతో నెల్లూరుకు న్యాయం జరుగుతుంది కానీ రాయలసీమ కాదన్నారు.గుండ్రేవుల,వేదవతి,సిద్దేశ్వరం,సమాంతర కాలువ,పెట్మికోట రిజర్వార్లు నిర్మించాలన్నారు.ఇంతవరుకు వైసిపి ప్రభుత్వం సీమకు చేసింది శూన్యమని అన్నారు.అక్టోంబర్ 01 నుండి నవంబర్ 16 వరుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు,అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ జెఎసి నాయకులు హరి,సురేంద్ర రెడ్డి,అశోక్,తెర్నకల్ రవి పాల్గోన్నారు.

Comment here