Andhra PradeshEast GodavariNews

ఇరువురికి జైలుశిక్ష విధించిన కోర్టు.. 

ఇరువురికి జైలుశిక్ష విధించిన కోర్టు..

కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం; రెండు దొంగతనం కేసుల్లో నిందితునిగా ఉన్న కొంకా పల్లి కి చెందిన పతివాడ లవ రాజు ఒక్కొక్క కేసులో 18 నెలల చొప్పున జైలు శిక్ష ను అమలాపురం  మెజిస్ట్రేట్ సిహెచ్ .హరిప్రియ విధించినట్లు పట్టణ ఎస్సై షేక్ బాజీ లాల్ తెలిపారు. దీనికి సంబంధించి 2019, 2020 , సంవత్సరం కేసులో నిందితునిగా ఉన్న లవ రాజు ను 21/3/21 అరెస్టు చేసి రిమాండ్ కు పంపటం జరిగిందని  ci తెలిపారు. నేడు  కోర్ట్ లో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఏ పి పి  గా సిహెచ్ రాజశేఖర్ ఈకేసును వాదించారు . అలాగే ఐ.పోలవరం చెందిన పల్లా సురేంద్ర కుమార్ కు 11 నెలల జైలు శిక్ష విధిస్తూ  మెజిస్ట్రేట్ సిహెచ్ హరిప్రియ  తీర్పునిచ్చారు. కుమార్ ఏటీఎంలు దగ్గర మాటువేసి. ఏటీఎం నుండి నగదు డ్రా చేసుకునే వారిని గుర్తించి,వారి దగ్గరనుండి డబ్బులు కాజేసిన నాలుగు సంఘటనలకు సంబంధించి నేడు ఈ తీర్పు వెలువడింది. ఈ కేసుకు సంబంధించి కూడ  ఏ పి పి, సి.హెచ్ రాజశేఖర్ వాదించడం జరిగింది.

Comment here