Andhra PradeshEast GodavariNews

ఈతకోట కనకదుర్గమ్మ వారి ఆలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు…

ఈతకోట కనకదుర్గమ్మ వారి ఆలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు…
ప్రజల క్షేమం కోసం
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
రాత్రీ వేళల్లో అందర్నీ ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు..
కోస్తా ఎన్ కౌంటర్, రావులపాలెం,కన్నుల పండుగగా ఈతకోటలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో మండలంలో అనేక చోట్ల ఘనంగా  జరుపుకుంటున్న దసరా ఉత్సవాలు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతీ ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా వర్దిలుతూ ఉండాలని ప్రజల శ్రేయస్సు కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రెండో రోజు కావడంతో మహిళలు భక్తులు తెల్లవారు జామున నుండే  అమ్మవార్లను దర్శించుకుని  దుర్గామాత. దుర్గాదేవిలకు కుంకుమ పూజలు నిర్వహించారు దీక్షలు చేపట్టిన భవానీలు చిన్నారులు విద్యార్థులు దుర్గమ్మను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని రోజుకో రూపంలో కనకదుర్గమ్మ వారు వివిధ రూపాల్లో భక్తులకు ప్రతీ రోజు దర్శనమిస్తారని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు తెలిపారు
అందరు కూడా దసరాలో అమ్మవారిని దర్శించుకుని ఆ దేవి దివ్య అనుగ్రహాన్ని పొందాలన్నారు నవరాత్రులు పురస్కరించుకుని ఆలయం చుట్ట ఏర్పాటు చేసిన లైటింగ్ డెకరేషన్ రాత్రీ వేళల్లో మిళా మిళా మెరుస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు

Comment here