Andhra PradeshEast GodavariNews

ఉద్యోగ భద్రత కోసం ఉద్యమం

ఉద్యోగ భద్రత కోసం ఉద్యమం

* గోకవరంలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో యానిమేటర్లు ధర్నా

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు సీఐటీయూ నాయకులు ప్రమీల, మాధురి, సరోజిని, కమల అన్నారు.. బుధవారం గోకవరం మండల కేంద్రంలో వెలుగు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు..సోమవారం నుండి గురువారం వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ లోని సీఐటీయూ సీఐటీయూ ఆద్వర్యంలో యానిమేటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నా కార్యక్రమం మూడో రోజుకు చేరిందని చెప్పారు.. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ప్రమీల మాట్లాడుతూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. ఇందులో ప్రధానంగా కాలపరిమితి సర్కులర్ ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రమీల చెప్పారు.. అలాగే గ్రామ సంఘం నుండి చెల్లించాల్సిన రెండు వేల రూపాయలు చెల్లింపులు జరిగేలా చూడాలని, సాంకేతిక కారణాలతో 1500 మంది వీఎవోల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని సీఐటీయూ మండల నాయకులు ప్రమీల చెప్పారు. మాధురి, కమల, సరోజిని మాట్లాడుతూ గ్రేడింగ్ పేరుతో వేతనాలు కోత, వేధింపులు, తొలగింపులు ఆపాలని, యూనిఫామ్, గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.. ఇక్కడ చేస్తున్న ధర్నాకు గోకవరం, తంటికొండ, తిరుమలయపాలెం, గాదెలపాలెం గ్రామాలకు చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రాణి, అనంత, రాజేశ్వరి, దేవి, శారద, లక్ష్మి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, వాణి, సుశీల, విజయమణి లు పాల్గొన్నారు.

Comment here