Andhra PradeshEast GodavariNews

ఉరుస్ గంధోత్సవం లో రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి

ఉరుస్ గంధోత్సవం లో రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి

 

రాజమహేంద్రవరం రూరల్,కోస్తా ఎన్ కౌంటర్ :
రాజమహేంద్రవరం స్థానిక మోరంపూడి గ్రామము నందుగల అత్యంత ప్రతిష్టాత్మకమైన సయ్యద్ అమీరుద్దిన్ ఔలియ బాబా దర్గా ఉరుస్ షరీఫ్ గంధంత్సవంలో కమిటీ వారి ఆహ్వానం మేరకు రుడా చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బాబా దీవెనలు తీసుకొని ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం రుడా చైర్మన్ మాట్లాడుతూ స్థానిక మోరంపూడి గ్రామము నందుగల ప్రసిద్ధి చెందిన సయ్యద్ అమీరుద్దిన్ ఔలియ బాబా దర్గా నందు ఉరుస్ గంధం ఉత్సవాలకు భక్తుల మతాలకు అతీతంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషమని చెప్పారు ప్రసిద్ధి గాంచిన దర్గాలో అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అప్సర్, కమిటీ ఉపాధ్యక్షులు కోశాధికారి మొహమద్ ఆరిఫ్ సయద్ అల్తాప్, యస్ కె హబీబ్ ,యస్.కె షరీఫ్, సయద్ రబ్బాని,సయద్ అబ్దుల్ అఫ్సర్ మరియు కమిటీ సభ్యులతో పాట తదితరులు పాల్గొన్నారు.

Comment here