Andhra PradeshEast GodavariNews

ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

*ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ పదవులకు నామినేషన్ స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో మల్లపు రెడ్డి శ్రీను సోమవారం తెలిపారు. ఈనెల 24వ తేదీన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక జరుగుతుందని అందుకు సంబంధించి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు లేదా వారి తరపు వారు నామినేషన్లు 24 వ తేదీ ఉదయం 10 గంటల లోపు మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలనన్నారు. 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలన జరుగుతుందని, అనంతరం సక్రమంగా ఉన్న వారి పేర్ల జాబితాను ప్రిసైడింగ్ ఆఫీసర్ నోటీస్ బోర్డులో ఉంచుతారన్నారు. 12 గంటల నుండి 1:00 లోపు లో నామినేషన్ను ఉపసంహరణకు గడువు ఉందన్నారు. అనంతరం మూడు గంటలకు ఎంపీటీసీల తో సమావేశం నిర్వహించి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు .ఇందుకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవోతెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందికె. మల్లేశ్వరరావు, యం. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Comment here