Andhra PradeshEast GodavariNews

ఎమ్మార్పీఎస్ ఉద్యమంతోనే అన్నీ సాధ్యం.

ఎమ్మార్పీఎస్ ఉద్యమంతోనే అన్నీ సాధ్యం.

కోస్తా ఎన్ కౌంటర్ పోలవరం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం  ఎల్ ఎం డి పేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విస్సంపల్లి సిద్దు మాదిగ పాల్గొన్నారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ పోరాటంతోనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆరోగ్యశ్రీ, రేషన్ బియ్యం పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణక లక్ష్య సాధన కోసం రెండున్నర దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని పోలవరంలో మాదిగలకు కనీస ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకపోవడం ప్రజలు జీవించే హక్కును కాలరాయడమే అని ఆయన విమర్శించారు. కచ్చితంగా ఈ విషయాన్ని మంద కృష్ణ మాదిగ దృష్టిలో పెడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి శ్రీను, ఎం అశోక్ ,హరిబాబు, వీర్రాజు, రాజేంద్ర యేసు తదితరులు పాల్గొన్నారు.

Comment here