Andhra PradeshEast GodavariNews

ఎస్సీల సంక్షేమాన్ని మరిచిన వైసీపీ

ఎస్సీల సంక్షేమాన్ని మరిచిన వైసీపీ

తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎస్సీ సెల్‌ సమావేశం…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : ఎస్సీల సంక్షేమాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మరిచిందని టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ముప్పిడి రమేష్‌ అన్నారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పిడి సురేష్‌ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అంబేడ్కర్‌ విదేశీ, విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌, పలు రకాల పథకాలను రద్దు చేసిందన్నారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు పీతల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో 70 శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లను ఇచ్చిందన్నారు. ఈ పథకాల రద్దుతో దళిత రైతులు బతుకులు దీనంగా మారాయన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మెరిపో సంతోషరావు, శీలి వెంకటాచలం, ఏలూరి జగదీష్‌, మార్లపూడి మహేష్‌, దూలపల్లి యశ్వంత్‌ పాల్గొన్నారు.

Comment here