Andhra PradeshEast GodavariNews

ఏజెన్సీలోని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు

రంపచోడవరం – ఏజెన్సీలోని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, వివిధ రకాల పెన్షన్లు నుండి తొలగించడం జరగదని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.
గురువారం స్ధానిక ఐ.టి.డి.ఎ. సమావేశపు హాలులో ఏడు మండలాలకు సంబందించిన ప్రజా ప్రతినిధులు, మాజీ ఎం.ఎల్.ఎ. కోసూరి సత్యనారాయణ రెడ్డి తో రేషన్ కార్డులు వివిధ రకాల పెన్షన్లు, పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు పూర్తిస్ధాయిలో నష్టపరిహారం తదితర అంశాలపై రంపచోడవరం ప్రాజెక్టు అధికారికి సుమారు 200 మందితో వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం ఐ.టి.డి.ఎ. సమావేశపు హాలులో వినతి పత్రంలో పొందుపరచిన అంశాలపై ప్రాజెక్టు అధికారి స్పందించి పి.ఒ. ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ప్రభుత్వ నిభందనల ప్రకారం 10 ఎకరాలు పైబడి భూమి ఉన్న వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని అందుకు కుటుంబంలోని 10 ఎకరాలు పైబడి భూమి ఉన్న రైతులు కుటుంబ సబ్యులు అందరు ఆ భూములను పంచుకున్న యెడల పెన్షన్లు రేషన్ కార్డులకు ఎటువంటి అభ్యంతరాలుండవని ఆయన తెలిపారు. అదేవిదంగా 18 సంవత్సరాలు నిండిన వారికి వేరువేరుగా మార్చుకోవాలని ఆయన తెలిపారు. భూములు ఎక్కువున్న వారికి, రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించిన వారికి గ్రామస్దాయిలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొండపోడు భూములకు కొన్ని సంవత్సరాలనుండి సాగు చేయుచున్న భూములకు అటవీ హక్కుల చట్టం ద్వారా సుమారు 50,000 ఎకరాలు సుమారు 18,000 వేల మంది గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ రైతు భరోసా పధకం అమలుచేయడం జరుగుతుందన్నారు. కొండపోడు భూములకు కూడా రైతు భరోసా పధకం అమలుచేయడం జరుగుతుందన్నారు. స్వచ్చ భారత్ లో కొన్ని మరుగుదొడ్లు మద్యలో ఆపేసారని, అటువంటివాటిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పి.ఒ. తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు భూమికి భూమి ఇవ్వడం జరిగింది కాని, కొంత మందికి పట్టాలు ఇవ్వలేదని పిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇటువంటి వాటిపై పట్టాలు ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిదంగా పోలవరం ముంపు బాధితులకు ఆర్.అండ్.ఆర్. కాలనీలలో ముఖ్యంగా త్రాగునీరు మరుగుదొడ్లు కరెంటు ఇండ్లు ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. G.O.No.3 పై కూడా చర్చించి కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకూ G.O.No.3 ని అమలుచేయాలని ప్రతినిధులు కోరడం జరిగింది. మొత్తం 40 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. 1 of 70 చట్టం, ప్రతీ మండలంలో రైతుబజారు, ఏజెన్సీలోని మండల కేంద్రాలలో గిరిజనులకు షాపింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరడం జరిగింది. అందుకు పి.ఒ. వివరణ ఇస్తూ 1 of 70 చట్టం లో భాగంగా 165 కేసులు గిరిజనులకు అనుకూలంగా తీర్పులో రావడం జరిగిందని, ఇంకా 65 కేసులు తీర్పులకు ప్రతిపాదనలో ఉన్నాయని, తీర్పులు ఇచ్చిన వాటికి, కొంతమంది అప్పీల్లకు వెళ్ళడం జరిగిందని ఆయన తెలిపారు. గిరిజనులకోసం మారేడుమిల్లి, రంపచోడవరం, ఐ.పోలవరం గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో నాలుగైదు చొప్పున 12 షాపులు కట్టడం జరుగుతుందని ముందుగా రంపచోడవరం లో నాలుగు షాపులు పూర్తయ్యాయని, ఇవి కొండరెడ్లకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, అదేవిదంగా రంపచోడవరం RTC కాంప్లెక్స్ ప్రక్కన రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దరఖాస్తు సమర్పించిన వారిలో మాజీ ఎం.ఎల్.ఎ. కోసూరి సత్యనారాయణ రెడ్డి, ఈకా అబ్బులుకొండ దొర, వలి తదితరులు పాల్గొన్నారు

Comment here