Andhra PradeshEast GodavariNews

ఏసీబీ  వలలో చిక్కిన  అవినీతి అధికారి

ఏసీబీ  వలలో చిక్కిన  అవినీతి అధికారి

* 21 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

గోకవరం మండలం రంప యెర్రంపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం హనుమంతరావు ఎసిబి వలలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం రంప ఎర్రం పాలెం గ్రామంలో ఉపాధి హామీ పధకం క్రింద నిర్మించిన సిమెంట్ రోడ్డు బిల్లుకు  సంబంధించి చెక్కును మంజూరు  చేయుటకు గాను వర్క్ కాంట్రాక్టర్ ఎం మురళి కృష్ణ వద్ద నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ సి హెచ్ సౌజన్య…. డిఎస్పీ పి రామచంద్ర రావు లు కార్యదర్శి హనుమంతరావు ఇరవై ఒక్క వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు

Comment here