Andhra PradeshEast GodavariNews

ఓబిసి మోర్చా తీవ్ర అసంతృప్తి

బీసి సామాజిక వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల బీసి వ్యతిరేక విధానాల పట్ల జిల్లా అధ్యక్షులు కాలెపు సత్యసాయిరాం అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంట్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా తీవ్ర అసంతృప్తి నిరసన తెలియజేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం రాజమండ్రి వారికి వినతిపత్రం అందించడమయ్యింది.
బిసిలు ఈ విధానాల మూలంగా ఇంకా వెనకబాటుకు గురవుతున్నారు. బిసిల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జిల్లాలో బీసీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. బిసి కార్పొరేషన్‌ల పేరుతో బిసి కులాలను విడదీసి ఆ కార్పొరేషన్లకు నిధులు, విధులు లేకుండా చేసి ఆయా కులాలను, ఆయా నాయకులను అవమాన పరుస్తున్నారు. బిసిల సబ్సిడీ రుణాలు ఎత్తివేసి , చేతి వృత్తులను విస్మరిస్తున్నారు. అలాగే వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను, విద్యా ఉద్యోగ శిక్షణా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. బిసి పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేశారు. మత్స్యకారులకు, నేతన్నలకు ఇచ్చే వ్యక్తిగత , సామూహిక సబ్సిడీ రుణాలు ఇవ్వడం మరచిపోయారు. నీటి కాలువలు, కుంటలు, చెరువులపై చేపలుపట్టే హక్కులు, మత్స్యకారులకు కేటాయించకుండా కుట్ర చేస్తున్నారు. మత్స్యకారుల హక్కులు హరించే జీఓ నెం.217 ను తక్షణమే రద్దు చెయ్యాలి. పోటీ పరీక్షలకు బిసి విద్యార్థులకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే సంచార ,అర్థ సంచార జాతుల (N.T, D.NT)  కులాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం జాతీయ (N.T ,D.N.T ) డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించిన జన గణన చేయమని కేంద్రం ఆదేశించినప్పటికి సంవత్సరం నుంచి ఎటువంటి కార్యాచరణా చేపట్టకుండా పెడచెవిన పెట్టి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. వివిధ సంచార జాతులలో కళాకారులకు పింఛన్లు ప్రోత్సవాహకాల మాటే లేదు. సంచార జాతుల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేతన్నలకు, విశ్వ బ్రాహ్మణులకు రజకులకు, నాయిబ్రాహ్మణలకు తదితర అనేక బిసి వర్గాల వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. జాతీయ ఓబిసి కమీషన్‌కు అనుసంధానంగా రాష్ట్ర బిసి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. గతంలో 16 కార్పొరేషన్లున్నపుడు వచ్చే నిధుల్లో నాల్గవ వంతు కూడా ఇపుడున్న 56 బిసి కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం బిసి కార్పొరేషన్లకు  నిధులు విడుదల చేసి బిసి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు తెరవాలని , చేతివృత్తుల వారికి పనిముట్లను సబ్సిడీ పై వెంటనే అందించాలి , సంచార జాతుల (N.T, D.N.T) కులాల  జనగణన నిర్వహించి వారికి డెవలప్‌మెంట్ బోర్డు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో బిసి కులాల వారీగా జనగణన ప్రకటించాలని నిరసన తెలిపి సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందించారు.
తదనంతరం ముఖ్యులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జగనన్న బిసి వినాశకర పధకం అమలవుతుందని విమర్శిస్తూ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుంటే భవిష్యత్ లో అంశాలవారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
★ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమైన వారు:
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపిశ్రీనివాస్ , జోనల్ ఇంచార్జ్ కురగంటి సతీష్ , ఉపాధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య , నందివాడ సత్యనారాయణ , బీజేపీ జిల్లా కార్యదర్శి నిల్లా ప్రసాద్ , రుక్కు , మండల అధ్యక్షులు యానాపు ఏసు , తంగెళ్ల శ్రీనివాస్ , డా.చెప్పిటి మూర్తి, రాయుడు రాఘవులు, మువ్వల మహేష్  తదితరులు పాల్గొన్నారు.

Comment here