Andhra PradeshEast GodavariNews

“కడియం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్.పి రస్తోగి”.

“కడియం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్.పి రస్తోగి”.
*కోస్త ఎన్ కౌంటర్,  కడియం;*  రాజమహేంద్రవరం అర్బన్ ఎస్.పి ఐశ్వర్య రస్తోగి ఆదివారం కడియం పోలీస్  స్టేషన్ ను సందర్శించి , రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి పొరపాట్లు వుంటే వెంటనే సరిదిద్దుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే సిబ్బందికి ఏ విధమైన ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. డయల్ 100 కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని , మండల ప్రజలకు అన్నివిధాలా జవాబుదారీతనంగా ఉండాలన్నారు. పారదర్శకంగా పనిచేస్తూ , నిజాయితీగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఏ విధమైన ఆరోపణలు ఎదుర్కొన్నా తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్బంగా సౌత్ జోన్ డి.ఎస్.పి ఎం.శ్రీలత , కడియం ఇంఛార్జ్ సి.ఐ రాంబాబు , ఎస్.ఐ లు , సిబ్బంది ఉన్నారు.

Comment here