Andhra PradeshEast GodavariNews

కన్నబాబు ను నిలదీసిన బిసి సామాజిక వర్గ నాయకులు

కన్నబాబు ను నిలదీసిన బిసి సామాజిక వర్గ నాయకులు
… ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నార..
 కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును మూడు సామాజికవర్గాల మధ్య గొడవ లో  నిలదీశారు. గురువారం నాడు రమణయ్య పేట పంచాయతీ పరిధిలోని నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి  కన్నబాబును ఒకటవ వార్డుకు సంబంధించిన ఎల్ల బోయిన  చిన్న తన సామాజిక వర్గం తో కలిసి నూకాలమ్మ గుడి  విషయంలో మాట్లాడారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సతైమ్మ తల్లి  గుడికి సంబంధించిన ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేపడతామని తెలిపారు. దీనిపై స్పందించిన శెట్టి బలిజ సామాజిక వర్గ ప్రతినిధులు గుడి నిర్మాణానికి శంకుస్థాపనకు తేదీని ఖరారు చేయడమే మా తప్ప అయిందా … మీరు గుడి విషయంలో ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారని మాటల యుద్ధానికి దిగారు. మంత్రివర్యులు గొడవ సద్దుమణిగింది విషయంలో అందరూ కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకుందామని తెలిపారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
*సత్తెమ్మ తల్లి గుడి విషయంలో మంత్రి  కన్నబాబు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాం: ఎల్ల బోయిన చిన్న*
 ఒకటో వార్డు సతైమ్మ తల్లి  గుడి నిర్మాణంపై జరిగిన మాటలకు స్పందించి  బీసీ సామాజికవర్గం నాయకులతో మాట్లాడటం జరిగిందని  కాకినాడ డిఎస్పి భీమారావు పేర్కొన్నారు. వారిని గురువారం సాయంత్రం సర్పవరం పోలీస్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డియస్పి భీమా రావు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం  ఒకటో డివిజన్ ల్లో పూరతన నూకలమ్మ గుడి ఉందనీ, దాని స్ధానంలో నూతన గుడి చేపట్టారని, అయితే సదరు స్ధలం దేవాదాయ శాఖకు చెందినదిగా రికార్డు ఉందనీ అక్కడ నివసించే ఒకరు సదరు స్ధలంపై కలక్టర్ కు స్పందన లో పిర్యాదు చేసారనీ,ఆ స్థలం పైన అధికారులు విచారణ చేస్తున్నారని,ఆ స్థలం ప్రవైట్ వ్యక్తులకు చెందిందా లేదా దేవదాయ శాఖ కు చెందిందా అనే కోణంలో విచారణ జరుగుతుందని దానిపై దర్యాప్తు చేస్తున్నామనీ తెలిపారు. అనంతరం మాజీ కార్పోరేటర్ ఎల్లబోయిన చిన్న మాట్లాడుతూ..
మంత్రి కన్నబాబును అడ్డుకున్నామనీ, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త కధనంలో వాస్తవం లేదని, తమ వార్డులో సుమారు డెబ్బై సంవత్సరాలుగా మూడు కులాల కలిపి కొలుచుకుంటున్న నూకలమ్మ నూతన గుడి నిర్మాణం పై దేవాదాయ శాఖ అభ్యంతరం పెట్టారని దీనిపై తాము మంత్రిని కలిసామనీ, ఆయన సానుకూలంగా స్పందించి దీనిపై దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడిన తరువాత గుడి నిర్మాణం చెపడతాము అని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మాలో ఉన్న వ్యక్తి పైన అనుమానం తోమేము గుడి నిర్మాణం ఆపుతున్నారని అపోహ పడ్డామని,మంత్రి కన్నబాబు ఒక వర్గానికి మద్దత్తు ఇస్తున్నట్లు తమకు తప్పుడు సందేశం ఇవ్వడం వలన అపోహా పడ్డామని అన్నారు. మంత్రి కన్నబాబు పై దురుసుగా ఏమైనా మాటలు వు0టే వెనక్కి తీసుకుంటామని తెలిపారు. మీడియా సమావేశంలో సి ఐ రాజశేఖర్, ఏ ఎస్ ఐ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Comment here