Andhra PradeshEast GodavariNews

కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ డిపో

 

కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ డిపో

* నష్టం వస్తున్న సర్వీస్ అందిస్తున్నాము
* సంవత్సరానికి పంచాయితీకి 60 వేలు చెల్లిస్తున్నాము
* గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ దేవుడుబాబుతో కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి అబ్దుల్లా ప్రత్యేక ఇంటర్వ్యూ
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : గోకవరం ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంది ?
* ఆర్టీసీ డీఎం : కరోనా దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాము.
*కోస్తా ఎన్ కౌంటర్  ప్రతినిధి : డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి ? వాటి పరిస్థితి ఏమిటి ?
* ఆర్టీసీ డీఎం : మొత్తం 64 బస్సులు ఉన్నాయి. ఇందులో 10 ప్రైవేట్ బస్సులు. అన్ని కండిషన్ గానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ప్రస్తుతం లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా ?
*  ఆర్టీసీ డీఎం : కరోనకు ముందు 78 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. కరోనా దెబ్బకు 63 శాతానికి పడిపోయింది.. మళ్ళీ పుంజుకుంటాము. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : మీ ఆదాయం, ఖర్చులు లెక్కలు ఎలా సరి చేసుకుంటారు ?
* ఆర్టీసీ డీఎం : బస్సు సర్వీసులు ద్వారానే ఆదాయం. అంటే టికెట్స్, లగేజీ, సామాన్లు ద్వారా వచ్చే ఆదాయంతో నడుస్తాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఆదాయం ఎక్కువగా వస్తుంది.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : కిలోమీటర్లు పరిధిలో మీ పై భారం ఏ విధంగా ఉంటుంది ?
* ఆర్టీసీ డీఎం : ఉదాహరణకు ఒక కిలోమీటర్ కు 35 రూపాయలు ఖర్చు అయితే 25 రూపాయలు వస్తుంది. డ్రైవర్లు బాగా నడుపుతున్నారు.. కనుక నష్టం తగ్గుతుంది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరగాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు. అన్ని బస్సులు తిరుగుతున్నాయా?
* ఆర్టీసీ డీఎం : 278 ఉద్యోగులు ఉన్నారు. 50 మంది కాంటాక్ట్ బేసిక్ లో తీసుకున్నాము. 64 సర్వీసుల్లో 60 సర్వీసులు తిరుగుతున్నాయి.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ఇప్పుడు తిరుగుతున్న సర్వీసుల్లో నష్టం వచ్చే ప్రాంతాలు ఏమిటీ ?
* ఆర్టీసీ డీఎం : రంపచోడవరం ఏజెన్సీ వైపు కొంత నష్టం వస్తుందని చెప్పొచ్చు.. ఇటువైపు ప్రయాణికులు పెద్దగా ఎక్కటం లేదు. ఆర్టీసీ పెట్టె ఖర్చుకు, రాబడికి బాగా తేడా ఉంటుంది. అయిన సర్వీసులు కొనసాగిస్తున్నాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : కొత్త రకం బస్సులను ఎందుకు తీసుకు రావటం లేదు ?
* ఆర్టీసీ డీఎం : ఇప్పుడు ఉన్న బస్సుల్లోనే ప్రయాణించటం లేదు.. కొత్త రకం బస్సులు ఖర్చు ఎక్కువ, టికెట్ ధర ఎక్కువే.. ఇక్కడ కష్టం.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : పోటీతత్వం పెరగటం వల్ల మీకు ఆదాయం పడిపోయిందా ?
* ఆర్టీసీ డీఎం : ప్రతి దానిలో పోటీతత్వం ఉంది. ప్రైవేట్ వాహనాలు గట్టిగా తిరుగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి గా.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ఆదాయ మార్గాలు పెరగాలంటే ఎలా ?
* ఆర్టీసీ డీఎం : ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉండాలి..మా డిపో నుండి దూర ప్రయాణాలు బహు తక్కువ.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : పంచాయితీకి మీరు ఏమైనా డబ్బులు చెల్లించాలా ?
* ఆర్టీసీ డీఎం : తప్పకుండా చెల్లిస్తున్నాము. సంవత్సరానికి 60 వేల రూపాయలు కడుతున్నాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : మీ డిపోలో సిబ్బంది కొరత ఏమైనా ఉందా ?
* ఆర్టీసీ డీఎం : కండక్టర్లు కొరత ఉంది..16 మందిని నియమించాల్సి ఉంది.. అదొక్కటే.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : మీ డిపో పరిధిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా ?
* ఆర్టీసీ డీఎం : డ్రైనేజీ వ్యవస్థ అసలు బాగోలేదు. అలాగే అందరు కలిసి కూర్చోవటానికి, మాట్లాడుకోవటానికి ప్రత్యేకంగా భవనం ఉండాలి.

Comment here