Andhra PradeshEast GodavariNews

కాకినాడ క్యాంపస్ లో స్కిల్ కాలేజ్

కాకినాడ క్యాంపస్ లో స్కిల్ కాలేజ్

  వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎం.ఎస్.ఎన్ క్యాంపస్ కాకినాడ లో స్కిల్ కాలేజ్ ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో రాజమహేంద్రవరం క్యాంపస్ లో స్కిల్ డెవల్పమెంట్ అధికారులతో వీసీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని దానికి తగినట్టుగా మనమంతా సమష్టిగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ కాలేజ్ ను కాకినాడ లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎం.ఎస్.ఎన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అవగాహాన ఒప్పందంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. దీనికి సంబంధించిన స్థల సేకరణ, ఏర్పాట్లు వంటి అంశాలను క్యాంపస్ ప్రత్యేకాధికారి డా.ఎం.కమలకుమారి పర్యావేక్షిస్తుండాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అందించే కోర్సులను గోదావరి జిల్లాల్లో ఉన్న వివిధ కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్య మెలుకులకు సంబంధించిన కోర్సులు ఉంటే ఎక్కువ ప్రయోజనమని సూచించారు. పెట్రోలియం, ఆక్వా, వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన స్కిల్ కోర్సులు అందించడం ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. స్కిల్ కోర్సుల ప్రవేశాలలో విశ్వవిద్యాలయ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధన్యతనివ్వాలని సూచించారు. త్వరలోనే కాకినాడ క్యాంపస్ లో స్కిల్ కాలేజ్ కు సంబంధించిన శంఖుస్థాపన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రత్యేకాధికారి డా.ఎం.కమలకుమారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ డి.హరిశేషు, సమన్వయ కర్త పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Comment here