Andhra PradeshEast GodavariNews

కిచ్చు ఆర్మీ సేవా సంఘం సేవలు అభినందించిన ప్రముఖులు

తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం
సమాజ అభివృద్ధి కోసం కిచ్చు ఆర్మీ సేవా సంఘం సేవలు ప్రతి ఒక్కరికి  ఆదర్శనీయం,
కిచ్చు ఆర్మీ సేవా సంఘం సేవలు అభినందించిన ప్రముఖులు
-రాజమహేంద్రవరం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పితాని కోమల
రాజమహేంద్రవరం, అక్టోబర్ 4:
సమాజ అభివృద్ధి కోసం కిచ్చు ఆర్మీ సేవా సంఘం సేవలు ప్రతి ఒక్కరికి  ఆదర్శనీయమని రాజమహేంద్రవరం డిప్యూటీ డి.ఎం అండ్.హెచ్.ఓ డాక్టర్ పితాని కోమల అన్నారు. గాంధీ జయంతిని పురష్కరించుకొని కిచ్చు ఆర్మీ సేవా సంఘం అధ్యర్యంలో  స్థానిక కంబాల చెరువు సమీపంలోని లలితా జ్యావెలర్స్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట వై ఆర్ జి కేర్ సంస్థలోని పిల్లలకు న్యూట్రిషన్ అందించే కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కానూరి శ్రీనివాస్ కిషోర్, కొత్తల రామ్ కిషోర్ ల అధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ పితాని కోమల, గోకవరం డిప్యూటీ ఎం ఆర్ ఓ క్రాంతి ప్రసాద్, గార్డ్స్ డైరెక్టర్ వరదా నాగేశ్వరరావు, మహిళా కన్వీనర్ డాక్టర్ రాయవరపు సత్యభామ, తదితరులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిల్లలకు న్యూట్రిషన్ అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కాలెపు తిరుమల శ్రీనివాస్, డబ్బాడ రాంబాబు, గుంటముక్కల సోమశేఖర్, లావేటి శ్రీనివాస్, కుప్పిలి వీరరాఘవేంద్రరావు, ఆకుల విజయభారతి,  సాల సత్యనారాయణ, వై.ఆర్.జి.కేర్ టెక్నీకల్ కో ఆర్డినేటర్ షేక్ రాజా, బాపామణి, వరదా ఆరోగ్య పుష్ప ,వై ఆర్ జి కేర్  చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్స్ లలితా యశోద కుమారి, పుష్ప ,భారతి ,సోమరాజు, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Comment here