Andhra PradeshEast GodavariNews

కిడ్నీ బాధితురాలికి 2,500 వందలు చేయుత

కిడ్నీ బాధితురాలికి 2,500 వందలు చేయుత

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: కోస్తా ఎన్ కౌంటర్ లో వచ్చిన కథనానికి స్పందించిన  హారిప్రియ మోటార్స్ ఫైనాన్స్ యజమాని నల్లమిల్లి హనుమంత రెడ్డి.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మస బత్తుల   పాపకు 2,500 రూపాయలు 30 కేజీల బియ్యం బస్తాను వారి కుటుంబానికి అందజేశారు, తన చిన్న కూతురు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాపకు నిరాశ మిగులుతుందని కన్నీరు కారుస్తోంది. చుట్టు పక్కల వాళ్ళు వారు పడుతున్న బాధలను చూడలేకపోతున్నారు. అప్పటికీ వారికి తోచినంత సహాయం చేశారు, సాయి రేణుక తన తల్లిని బ్రతికించు కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అన్ని విఫలమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన ఆరోగ్య శ్రీ కూడా ఆ కుటుంబానికి ఉపయోగ పడలేదని సాయి రేణుక అంటుంది. కోస్తా ఎన్ కౌంటర్ లో వచ్చిన కథనాలకు గ్రామంలో  ఎవరో ఒకరు స్పందించి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, తల్లి కి మందులు కొని వేసే స్తోమత లేక ఆ కూతురు తల్లడిల్లిపోతుంది. ప్రభుత్వం తన తల్లిని బతికించాలని కూతురు సాయి రేణుక మొరపెట్టుకుంది. మస బత్తుల పాపకు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో. ఇప్పటివరకు ఇళ్లల్లో పని చేసుకుంటూ.. తన ఇద్దరు కూతుళ్లను చదివించింది. పెద్ద కూతురును పెళ్లి చేసి అత్తారింటికి పంపింది. పెళ్లి కోసమని తమకున్న ఇంటిని కూడా అమ్మేశారు, చిన్న కూతురు రేణుక కిరాణా షాపులో పని చేస్తూ. వచ్చిన డబ్బులతో ఇంటిని గడుపుతూ.. తల్లి కి మందులు కొనేది. ఈ మధ్యకాలంలో తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో. కనీసం తిండి కూడా తినడం లేదని రేణుక తల్లి ని చూసుకోవడానికి కిరాణా షాప్ లో పని మానేసింది. ఆ కుటుంబం ఇప్పుడు మరింత ఇబ్బందులకు గురయ్యారు, గ్రామంలో ఉన్న ప్రజలు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తే ఒక ప్రాణంతో కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము.

Comment here