Andhra PradeshEast GodavariNews

కుక్క దాడిలో బాలికకు గాయాలు

కుక్క దాడిలో బాలికకు గాయాలు
పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో కుక్క దాడిలో గాయపడిన బాలిక…..
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : రోడ్డుపై ఆడుకుంటున్న బాలికపై కుక్క దాడి చేసిన సంఘటన మండలంలోని రావిపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. దీంతో బాలిక పెద్దగా ఏడ్వడంతో స్థానికులు కుక్కను తరిమికొట్టారు. బాలికకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కలు స్వైర విహారం చేసి చిన్నారులు, పశువులు అనే తేడా లేకుండా దాడి చేయడంపై తల్లిదండ్రులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్‌ పెన్నాడ సూరిబాబు మాట్లాడుతూ కుక్కలను పట్టుకునే సమయంలో వాటిని బయటకు రాకుండా కట్టేసి తర్వాత బయటకు వదులుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే రెండు పర్యాయాలు కుక్కలను పట్టించామన్నారు. అక్కడక్కడా ఉన్న కుక్కలను పట్టుకోవడానికి గ్రామస్తులు సహకరించాలన్నారు.

Comment here