Andhra PradeshEast GodavariNews

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలి

యుపిలో రైతులపై కేంద్ర మంత్రి  కొడుకు  హత్యాకాండకు నిరసనగా ఆందోళన.
    కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలి.
   రైతులను చంపిన  కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆసీస్ , అనుచరులను కఠినంగా శిక్షించాలి.
 కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ లో చేసిన రైతు చట్టాల సవరణలను రద్దుచేయాలని  డిమాండ్ చేస్తూ ఆదివారం ఉత్తరప్రదేశ్ లో  రైతులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనపై కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా తనుడు ఆశిష్  రైతులపై  తుపాకులతో కాల్చి, కారు ఎక్కించి సుమారు 10 మంది చావుకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని
సోమవారం రాజమహేంద్రవరం
నందం గనిరాజు సెంటర్ లో  సీపీఎం పార్టీ  మరియు రైతు సంఘాల సమన్వయ కమిటీ అద్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భం గా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్,citu జిల్లా కార్యదర్శి ss. మూర్తి మాట్లాడుతూ  దేశం లో  రైతాంగాన్ని దివాళా తీయించి వ్యవసాయ రంగాన్ని విదేశీ ,స్వదేశీ కార్పొరేట్ సంస్థ లకు అప్పగించేందుకు  మోడీ ప్రభుత్వం  భారత వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసిందని  ,ఈ విష్యాన్ని గ్రహించిన  భారత రైతాంగం 10 నెలలుగా దేశ రాజధానిలో   పోరాడుతున్నారని అన్నారు.  ఇప్పటివరకూ సుమారు 600 పైబడి రైతులు ఈ పోరాటం లో తమ ప్రాణాలు అర్పించారని , ఇవన్నీ బీజేపీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. దేశం లో నేటికీ 60 శాతం పైబడిన ప్రజలు వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారని , పంజాబ్,హర్యానా,ఉత్తర ప్రేదేశ్, బీహార్ , వంటి రాష్ట్రాలలో 70 శాతం పైబడి  ఈ రంగం పైనే ఆదారపడ్డారన్నారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని  విచిన్నం చేయాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు.అందుకే నేరుగా  దాడులకు,హత్యలకు పునుకుంటున్నారని అన్నారు. హర్యానా ముఖ్యమంత్రే  రైతులపై దాడులకు పురిగొల్పడం దుర్మార్గమన్నారు. దేశం లో బీజేపీ బడాబాబుల సేవలో ఉందని, సాధారణ ప్రజలను గాలికొదిలేసిందని   ఆక్షేపించారు. రానున్న  5 రాష్ట్రాల ఎన్నికల్లో  బీజేపీ కి రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  వెంటనే యు.పి.లో రైతుల  హత్యాకాండకు కారకులు కఠినంగా శిక్షించాలని, రైతులపై దాడులకు పురిగొల్పిన కేంద్రమంత్రిని పడవినుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఎం  రాజమండ్రి నగర కార్యదర్శి  పోలిన.వెంకటేశ్వర రావు,  రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు     సోమేశ్వర రావు,సుబ్రహ్మణ్యం, పి.తులసి,బి.పవన్, బి.పూర్ణిమరాజు,బి.రాజులోవ,వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comment here