Andhra PradeshEast GodavariNews

కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం

కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ సిఈఓ ఎన్.సత్యనారాయణ
కోస్తా ఎన్ కౌంటర్, ఆత్రేయపురం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ ఇచ్చిన టైం లైన్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సిఈఓ మరియు కొత్తపేట నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఎన్. సత్యనారాయణ అధికారులను  ఆదేశించారు.స్థానిక ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్ లో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మరియు ఆత్రేయపురం మండలాలకు సంబంధించిన అందరు మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరగా ప్రారంభించి, సమయానికి పూర్తి చేయాలని అన్నారు.ప్రతీ పనికీ విడివిడిగా ఎగ్జిక్యూటివ్ ఏజన్సీలు ఉండాలన్నారు..జగనన్న చేదోడు, ఈబీసీ నేస్తం, సీజనల్ వ్యాధులు, వైఎస్ఆర్ భీమా, అన్ని పధకాల లబ్ధిదారుల డిజిటల్ ఎక్ నాలెడ్జ్ మెంట్ తదితర అంశాలపై అధికారులను మండలాల వారీగా సమీక్షించారు..ఈ సమావేశం లో ఎంపీడీఓ లు నాతి బుజ్జి, కె.రత్న కుమారి, రాజేంద్ర ప్రసాద్ ,తాహశిల్దార్లు ఎం.రామకృష్ణ, కిషోర్ బాబు, డిఈలు సూర్యనారాయణ, కుమార్,నాలుగు మండలాల వ్యవసాయ, ఇంజనీరింగ్, హౌసింగ్, ఉపాధి హామీ, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ , ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Comment here