Andhra PradeshEast GodavariNews

*కొబ్బరి చెట్లు పంచాయతీకిఆదాయ వనరులు*

*కొబ్బరి చెట్లు పంచాయతీకిఆదాయ వనరులు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* ఆహ్లాదకరమైన వాతావరణానికి, పంచాయితీకి ఆదాయం తెచ్చేందుకు కొబ్బరి మొక్కలు నాటుతున్నట్లు మండలంలోని నదురుబాద గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అన్నారు. గ్రామంలో పంచాయతీకి చెందిన మంచినీటి చెరువు చుట్టూ కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొబ్బరి మొక్కలు నాటడం వల్ల పచ్చని ప్రకృతి ఏర్పడడంతోపాటుగా పంచాయితీకి దీర్ఘకాలం ఆదాయం సమకూరుతుందన్నారు. గత నలభై సంవత్సరాలుగా గ్రామంలో కొబ్బరి మొక్కలు నాటిన దాఖలాలు లేవన్నారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు గ్రామస్థుల సహకారంతో తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మంచినీటి చెరువు చుట్టూ 150 కొబ్బరి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Comment here