Andhra PradeshEast GodavariNews

క్లాప్‌ను విజయవంతం చేయండి

క్లాప్‌ను విజయవంతం చేయండి
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంపై సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా, మున్సిపల్‌ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే గాంధీ జయంతి నాడు క్లాప్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అపారిశుద్ధ్యం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారన్నారు. అనంతరం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, క్లీన్‌ తాడేపల్లిగూడెం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ సృజన, మెప్మా అధ్యక్షురాలు బోళెం రామలక్ష్మి, దృశ్య కళలల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మానికొండ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకుడు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, కాకర్ల శ్రీనివాస్‌, బూడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Comment here