Andhra PradeshEast GodavariNews

గర్భస్ధ లింగ నిర్ధారణ చట్టం అమలు పై డివిజనల్ స్ధాయి మీటింగ్

గర్భస్ధ లింగ నిర్ధారణ చట్టం అమలు పై డివిజనల్ స్ధాయి మీటింగ్ నిర్వహించిన ఆర్.డి.ఓ ఎ.జి.చిన్నికృష్ణ

          ఆడపిల్లల పుట్టుకను పెంచూతూ, సమాజంలో ఉన్న స్త్రీ, పురుష అసమానత అనే వివక్షతను, మనస్ధత్వాన్ని రూపుమాపేందుకు ఆడపిల్లల నిష్పత్తిని పెంచేందుకు పిండ పరీక్షలు-గర్భస్ధ లింగ నిర్ధారణ చట్టాన్ని సమర్ధంగా, కట్టు దిట్టంగా అమలు పరిచేందుకు అందరూ కృషిచేయాలని  కాకినాడ ఆర్.డి.ఓ  ఎ.జి.చిన్నికృష్ణ సూచించారు. లింగ నిర్ధారణ చట్టం అమలు తీరుపై డివిజనల్ స్ధాయి సలహ కమీటి సభ్యులతో శుక్రవారం తమ కార్యాలయములో ఆయన సమీక్షించారు. కాకినాడ డివిజనల్ లో గల 89 స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షల వివరాలు ప్రకటించకుండా వైధ్యులు, పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిర్ధారణ చట్టం అమలు, తనిఖీలలో భాగంగా డివిజనల్ లోని 7 స్కానింగా కేంద్రాలలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి లింగ నిర్ధారణ అంశాన్ని తెలియజేస్తున్నారా అనే అంశం పై నిఘా నిర్వహించడమైనది. అయితే ఈ కేంద్రాలలో లింగ నిర్ధారణ వివరాలు వ్యక్త పరుచుట లేదని గుర్తించినారు. జిల్లా కలక్టరు వారి ఆదేశముల ప్రకారము ప్రతి మాసములోను అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికముగా తనిఖీ చేయుట జరుగుతుందని, అట్టి సమయములో ఎవరైన తప్పుడు పద్దతులు పాటిస్తునట్లు గుర్తించినట్లయితే అట్టి కేంద్రములపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజేసినారు.   లింగ నిర్ధారణ చట్టంలోని అంశాలు వాటి అమలు వలన జరిగే సామాజిక ఫలితాలు గురించి గ్రామ స్ధాయిలోను, మండల స్ధాయిలోను, డివిజనల్ స్ధాయిలోను అందరు మహీళలతో అవగాహన, చైతన్య కార్రక్రమములు తరుచూగా జరపాలని సూచించారు. స్కూలు విద్యార్ధీనులకు, డోక్రా గ్రూపు మహీళలకు, తల్లులకు స్థానిక ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, స్ధానిక గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు సమన్వయముతో విశృతముగా లింగ నిర్ధారణ చట్టం, ఆడపిల్లలపై గల వివక్షత, దిశ చట్టం మొదలైన అంశములపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విధముగా ప్రతి రెండు నెలలకు ఒకసారి డివిజనల్ స్దాయి సంఘ సభ్యులతో సమీక్ష సమావేశము జరుపబడునని వివరించారు. ఈ కార్యక్రమములో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా. సి.హెచ్. వి. భరత లక్ష్మి, గైనకాలజిష్ట్, రేడియోలాజిష్ట్, అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, హెల్త్ ఎడ్యుకేటర్, ఇతర ఎన్.జి.ఓ సభ్యులు హజరైనారు

Comment here