Andhra PradeshEast GodavariNews

“గర్భిణీలకు, కిశోరబాలికలకు 104 సిబ్బంది అవగాహన”

“గర్భిణీలకు, కిశోరబాలికలకు 104 సిబ్బంది అవగాహన”
కోస్తా ఎన్ కౌంటర్, కడియం …. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా 104 సిబ్బంది అంగన్వాడీ ఏ.ఎన్.ఎం ల ఆధ్యర్యంలో గర్భిణీలకు, కిశోరబాలికలకు అవగాహన కల్పించారు . శనివారం మండలంలోని పొట్టిలంక లో గర్భిణీలకు కడియపులంకలో కిశోరబాలికలకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.మనోజ్ ఆధ్యర్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపుఅలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, చిన్నపిల్లల తల్లుల బాధ్యతల గూర్చి వివరించారు . అనంతరం బి.పీ, హిమోగ్లోబిన్, ఈ.సి.జి,షుగర్ తదితర నిర్ధారణ పరీక్షలు చేశారు .అన్నిరకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందులు పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో వాహన సిబ్బంది అంగన్వాడీలు, ఏ.ఎన్.ఎం లు, ఆశాలు పాల్గొన్నారు

Comment here