Andhra PradeshEast GodavariNews

గర్భిణీలు ఆరోగ్య సూత్రాలు పాటించాలి

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:గర్భిణీలు ఆరోగ్య సూత్రాలు  పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలు పుడతారని వైద్యులు అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా గురువారం అంగర,అచ్యుతాపురం,వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యురాలు జె.ఏ  ప్రియాంక,శివరంజని,కరుణ ఇంద్ర కుమారి,రాకేష్ చౌదరి,చంద్రమౌళి గర్భిణులకు  వైద్య  పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ గర్భిణీలు వైద్యులు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించాలన్నారు .110 మంది గర్భిణీలకు కపిలేశ్వరపురం దుర్గా పీఠం వ్యవస్థాపకులు భాస్కర స్వామీజీ ఆహార పొట్లాలు అందజేశారు.అంగర సత్యసాయి సేవా సమితి సభ్యులు పాలు బిస్కెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో  ఎంపిహెచ్ఎస్ సురేష్, హెచ్ ఎన్ ఎస్ఎల్ కుమారి,హెల్త్ ఎడ్యుకేటర్  నారాయణమ్మ సూపర్వైజర్లు  స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వైద్యసేవలు అందించారు.

Comment here