Andhra PradeshEast GodavariNews

‘ గుండె’ పదిలం

 ‘ గుండె’ పదిలం
… ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో   ప్రపంచం గుండె దినోత్సవం కార్యక్రమం
… గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు డాక్టర్ల స్పష్టం
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 22 కు సంబంధించి నూతన విధానాలను ప్రకటించిన విధంగా గుండెకి సంబంధించిన వ్యాధుల పట్ల డిజిటల్  రెవల్యూషన్ తెచ్చి గుండె పదిలం గా ఉంచుకోవాలని ట్రస్ట్ హాస్పిటల్  కార్డియాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ పేర్కొన్నారు. బుధవారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం పంచాయతీ పరిధిలో న్యూ ట్రస్ట్ హాస్పిటల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ నిశాంత్ మాట్లాడుతూ గుండెకు సంబంధించిన వ్యాధుల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని గత పది సంవత్సరాలుగా గుండె పై అనేక అవగాహన కార్యక్రమాలు ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుందన్నారు. నేటి కాలంలో డిజిటల్ హెల్త్ కేర్ విభాగాలను పటిష్టం చేయడం జరుగుతుందన్నారు. డిజిటల్ వాచీలు ద్వారా గుండె ఎంత సేపు కొట్టుకుంటుంది వాటి విధి విధానాలు తెలుసుకోవడం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు అందరూ ఒక వాట్సాప్ గ్రూపు గావ్ ఏర్పడి వారి సమస్యలను తెలుసుకుని వాటిపై ఎలా స్పందించాలని వాటిపై ఒకరినొకరు చర్చించుకోవాలన్నారు. ఈసీజీ కూడా డిజిటల్ లో అందుబాటులో ఉంటుందని డిజిటల్ విప్లవం సాధించడం జరుగుతుందన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు గుండెను పదిలంగా ఉంచుకోవాలని ప్రతి సంవత్సరం పూర్తిగా హెల్త్ చెక్ అప్ లను చేసుకోవాలని తెలిపారు. ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గుండెను పదిలంగా చూసుకోవాలంటే సరి అయిన ఆహారపు అలవాట్లను వ్యాయామ మరియు ఎప్పటికప్పుడు ఆరోగ్య చెక్  అప్   చేసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు కట్టడి చేయడం జరుగుతుందన్నారు. రెండు విభాగాలుగా విభజించుకుని గుండె వ్యాధులు రాకుండా పాటించవలసిన సూచనలు రెండవదిగా రిస్కు క్యాటగిరి కిట్ల ద్వారా గుండెకి సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించుకుని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యధిక మందికి గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడం వల్లే అత్యధిక మరణాలు సంభవించాయని తెలిపారు. ఆరోగ్యంపై కనీసం శ్రద్ధ లేకుండా గడపడం వలన ఆరోగ్యానికి  ఒక గంట అయినా సమయం కేటాయించక పోవడం పట్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి గ్రస్తులు అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర హాస్పటల్లో గుండెకి సంబంధించిన ప్రతి చెకప్ చేయడం జరుగుతుందని,  అత్యాధునిక పరికరాలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం ట్రస్ట్ హాస్పిటల్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,డాక్టర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Comment here