Andhra PradeshEast GodavariNews

*గులాబ్ తుఫాన్ దాటికి చెరువును తలపిస్తున్న సాయి నగర్ కాలనీ*

*గులాబ్ తుఫాన్ దాటికి చెరువును తలపిస్తున్న సాయి నగర్ కాలనీ*

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం:
జీవీఎంసీ 79వ వార్డు దేశపాత్రునిపాలెం సాయినగర్ కాలనీ గులాబ్ తుఫాన్ దాటికి నీటి ముంపుకు గురైంది. దీనికి కారణం సాయినగర్ కాలనీ నుండి వెళ్ళే సీసీ డ్రైనేజీ ని పవర్ గ్రిడ్ పరిశ్రమ వారు 10 సంవత్సరాల క్రితం నూతన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణం సందర్భంగా డ్రైనేజ్ ని దారి మళ్ళించడం అయింది. మరలించిన డ్రైన్ లో పూడిక మరియు తుప్ప తీగలు తో నిండి నీటి ప్రవహంకు అడ్డుగా అడ్డుగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుతుందని స్థానికులు వాపోతున్నారు. అలాగే పైగా డ్రైన్ వెళ్ళే దారిలో పవర్ గ్రిడ్ వారు మెస్ బిగించి ఉండడం కూడా దీని ప్రధాన కారణమని అంటున్నారు.ఉన్నారు వర్షాలు వచ్చే ప్రతిసారి కూడా ముంపుకు గురవుతుంది. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు వెంటనే స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా వై యస్ ఆర్ సి పి నాయకులు కాసు అంజిరెడ్డి, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు సాయినగర్ ప్రజలు కోరుతున్నారు.

Comment here