Andhra PradeshEast GodavariNews

*గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా*

*గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా*

*రాయవరం వైస్ ఎంపీపీ చంద్రశేఖర్*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ ఆరీఫ్ తో కలిసి పని చేస్తానని వైస్ ఎంపీపీగా ఎన్నికైన గుమ్మడి చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీ కాళ్ళ అప్పారావు లను సర్పంచ్ ఆధ్వర్యంలో , వార్డు సభ్యులు,సచివాలయ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా మౌళిక వసతుల కల్పనకు సర్పంచ్ఆరీఫ్ తో కలిసి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీ సభ్యుడు కాళ్ళ అప్పారావు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న సర్పంచ్ కి తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సమిష్టి సహకారం తో గ్రామాన్ని అన్ని రంగాలలోఅభివృద్ధి పథంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తొలుతగా వైస్ ఎంపీపీ, ఎం పి టి సి లను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాఖ అది నారాయణ(బుజ్జి), వార్డు సభ్యులు, వైసిపి సీనియర్ నాయకుడు ధూళిపూడి వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు, పాల్గొన్నారు.

Comment here