Andhra PradeshEast GodavariNews

ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు.

కోస్తా ఎన్ కౌంటర్ టీ నర్సాపురం.టి.నరసాపురం లోని చిన్న గురవాయి గూడెం లో గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు గురువారం ప్రారంభం అయినాయి మొదటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు కు కలశ స్థాపనతో నవరాత్రులు ప్రారంభం అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు గణపతి పూజ కుంకుమ పూజలతో నవరాత్రులు ప్రారంభం అయినాయి ఈ నవరాత్రులలో 12వ తేదీ మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి అవతారం చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం అనంతరం ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు 15వ తేదీ విజయదశమి సందర్భంగా అమ్మవారికి ముత్తయిదువుల చే ప్రత్యేక పూజలు సాయంత్రం 8 గంటల నుండి మూల మంత్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరుగునని 16వ తేదీ అమ్మవారి ఊరేగింపు 17వ తేదీ అఖండ అన్నసమారాధన తో నవరాత్రులు ముగుస్తాయని ఆలయ కమిటీ తెలియజేశారు ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు యలమర్తి వెంకటేశ్వరరావు రెడ్డి శ్రీనివాస్ నిమ్మగడ్డ శ్రీనివాస్,నందికొండ రామకృష్ణ, ఉమామహేశ్వరరావు దావులూరు శ్రీనివాస్ సుధాకర్ ఆ రె టిబ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు

Comment here