Andhra PradeshEast GodavariNews

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు.

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం తిరుమల దేవి పేట గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి వి రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి  నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లడం ఒక మోడీకే సాధ్యమని ఆయన తెలిపారు. 2005  సంవత్సరం నుండి అస్సాం రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగమల్లేశ్వరరావు, ఏ ప్రసాద్, ఎం వెంకటస్వామి, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comment here