Andhra PradeshEast GodavariNews

ఘనంగా శ్రావణ మాసం పూజలు .

ఈతకోట కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు .
కోస్తా ఎన్ కౌంటర్ రావులపాలెం.ఘనంగా శ్రావణ మాసం పూజలు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతన కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం నాడు ఆలయ కమిటీ చైర్మన్ యర్రంశెట్టి రామ్మోహన్ రావు(రాము)మరియు సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం నాలుగో వారం కావడంతో తెల్లవారుజామున నుండే అధిక సంఖ్యలో మహిళలు భక్తులు చిన్నారి విద్యార్థులు అమ్మవారికి పూజలు నిర్వహించారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వరలక్ష్మిదేవిగా  దుర్గామాతగా దుర్గాదేవిగా పిలవబడే ఈతకోటలోని కనకదుర్గమ్మ వారిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఎంతో దూర ప్రాంతాల నుండి ప్రతీ రోజు ప్రతీ శుక్రవారం నాడు ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు  ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఎల్లవేళలా క్షేమంగా వర్దిలుతూ సుఖ సంతోషాలతో సకల సంపదలు కలిగి పాడి పంటలతో గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆలయ అర్చకులు ఖండవిల్లి శ్రీనివాసా చార్యులు అమ్మవార్లకు పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా సామగ్రిని సమకూర్చి తీర్ధ ప్రసాదాలను అందజేశారు

Comment here