Andhra PradeshEast GodavariNews

చంద్రబాబు ఇంటి పై దాడి ఖండించిన జ్యోతుల నవీన్

చంద్రబాబు ఇంటి పై దాడి ఖండించిన జ్యోతుల నవీన్
కోస్తా ఎన్ కౌంటర్ జగ్గంపేట
    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి ని హేయమైన చర్యగా జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతుల నవీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడుఇంటి పై దాడి హేయమైన చర్య అన్నారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని అని చెప్పి వెళ్లడం ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోలేదని ఇది ప్రభుత్వ వైఫల్యమా  ఇంటెలిజెన్స్ వైఫల్యమ అని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం రైతు సమస్యల పైన ప్రజా సమస్యల పైన పోరాడుతుంటే ఎక్కడికక్కడ పోలీసుల తో అడ్డుకొని ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకుని పరిపాలన సాగించాలని పోలీసు వ్యవస్థ న్యాయపరంగా ఉపయోగించుకోవాలి అన్నారు. ఒక బీసీ నాయకుడు అయినటువంటి అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటల పై ఇంతటి రాద్ధాంతం చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోర్పు సాయి తేజ, జిల్లా నాయకులు జీను మణిబాబు, బుర్రి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Comment here