Andhra PradeshEast GodavariNews

చంద్రబాబు మోజులోపడి ఇస్లాం ధార్మిక విలువలను కించపరచకండి

*చంద్రబాబు మోజులోపడి ఇస్లాం ధార్మిక విలువలను కించపరచకండి*మాజీ మండలిచైర్మన్ షరీఫ్ కు ఆరిఫ్ హితవు*
*మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న మీ వ్యాఖ్యలు ఆక్షేపణర్హంకాదు*
*ఆంధ్రులకు ఉమ్మడి రాజధాని దూరమైంది మీ నాయకుడి కుట్రలవల్లేనన్న నిజాన్ని అంగీకరించండి*
*అసత్య ఆరోపణలుచేసి మీప్రతిష్టను దిగజార్చు కోకండి*
కోస్తా ఎన్ కౌంటర్, రాజమేంద్రవరం సిటీ ;
చంద్రబాబు మాయలోపడి రాజకీయ స్వలాభం కోసం ధర్మ వ్యతిరేక కార్యకలాపాలను సమర్థించడం ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షులు మోహమ్మద్ ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానిక జాంపేట లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడంవల్ల యువకులు ఉపాధి కోల్పోతున్నారన్న మీరు, మద్యం తయారీ, విక్రయం, రవాణా తదితరాలను నేటి యువతకు ఉపాధి మార్గంగా సూచిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారుతున్నప్పుడు ఏరోజు మద్యనిషేధ ప్రస్తావనను తీసుకురాని మీరు ఈరోజు మద్యనిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులువేస్తుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మీ స్థాయికి తగదనిఅన్నారు.
నేటికీ హైదరాబాదే మన రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని అని,మీ నాయకుడి కుట్రపూరిత రాజకీయాల వల్లే హైదరాబాద్ మనకు దూరమైందన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. మటన్ మార్ట్లు ఏర్పాటుచేసే ఆలోచనఏది ప్రభుత్వానికి లేదని స్వయంగా మంత్రి గారే ప్రకటించారని, అయినా ఆ విషయం పై రాద్ధాంతం చేయడం తగదని అన్నారు.
ఇటీవల లోక్ సభలో ఎంపీలుఅడిగిన ఒకప్రశ్నకు సమాధానంగా ఆంధ్రరాష్ట్ర రాజధానిగా వైజాగ్ ను పేర్కొంటూ కేంద్రం రిలీజ్చేసిన పత్రాన్ని మీరుచూసే ఉంటారని, మరి ఆ విషయంలో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని అడిగారు. గతంలో చంద్రబాబుని కీర్తిస్తూ మీరు ఒక అత్యంత వివాదాస్పద వ్యాఖ్య చేసి మరలా దానికి వివరణ ఇచ్చి మీ ఔన్నత్యాన్ని ప్రదర్శించారని, ఇప్పుడు కూడా ఇస్లాం ధర్మవిరుద్ధమైన మద్యపానాన్ని సమర్థించే మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ఆత్మపరిశీలన చేసుకుంటారని భావిస్తున్నామని అన్నారు.

Comment here