Andhra PradeshEast GodavariNews

చింతమనేని ని తక్షణమే విడుదల చేయాలి

చింతమనేని ని తక్షణమే విడుదల చేయాలి

కోస్తా ఎన్ కౌంటర్, రాయవరం: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తున్న చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయడం దుర్మార్గమని రాయవరం మండల టిడిపి నాయకుడు మేడపాటి రవీందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయడం హేయమైన చర్యయన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన చింతమనేని వెంటనే విడుదల చేయాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Comment here