Andhra PradeshEast GodavariNews

జనసేన ఆధ్వర్యంలో నిమ్మ మొక్కల పంపిణీ

జనసేన ఆధ్వర్యంలో నిమ్మ మొక్కల పంపిణీ
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : జనసేన వన రక్షణ కార్యక్రమం లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో  84 వ రోజు గండేపల్లి మండలం మల్లేపల్లి లో మంగళవారం 700 నిమ్మ మొక్కలు పంపిణీ చేసినట్లు  జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్య చంద్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం లో ఇప్పటివరకు 84300 నిమ్మ మొక్కలు పంచడం  జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠం శెట్టి శ్రీదేవి గండేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గోన శివ, యరమళ్ళ రాజు, వెలిది చిన్నోడు, పోకల అనిల్, జనసైనికులు పాల్గొన్నారు.

Comment here