Andhra PradeshEast GodavariNews

జియోసైన్సెస్ లైబ్రరీని ప్రారంభించిన వీసీ

జియోసైన్సెస్ లైబ్రరీని ప్రారంభించిన వీసీ

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిపార్టమెంట్ ఆఫ్ జియోసైన్సెస్ లైబ్రరీని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ దాతల సహకారంతో జియోసైన్సెస్ విభాగంలో డిపార్టమెంట్ లైబ్రరీని ప్రారంభించడం జరిగిందని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు డిపార్టమెంట్ లైబ్రరీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ లైబ్రరీలో సుమారు 1000 జర్నల్స్, 100 టెక్స్ట్ బుక్స్, 150 థీసెస్, 100 జి.ఎస్.ఐ రిపోర్ట్స్, 200 ఎం.ఎస్సీ ప్రాజెక్ట్ వర్క్స్, 500 ఓ.ఎన్.జి.సి న్యూస్ లెటర్స్, 500 పబ్లికేషన్స్ ఉన్నాయన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని మొట్టమొదటి డిపార్టమెంట్ లైబ్రరీగా దీనిని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విశ్వవిద్యాలయంలోని మిగిలిన విభాగాలు డిపార్టమెంట్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విభాగ గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్య, విజ్ఞానం అందుతాయని తెలిపారు. తరువాత జియోసైన్సెస్ లో ఫుల్ టైమ్ స్కాలర్స్ తో వీసీ మాట్లాడి పరిశోధన అంశాలపై ఆరా తీసారు. సమగ్రమైన పరిశోధనలు చేయాలని, నిరంతరం పరిశోధన అంశాలపై దృష్టిని సారించాలని తెలియజేసారు. విభాగాధిపతి డా.కె.నూకరత్నం మరియు అధ్యాపకులు వీసీ ని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డా.కె.రమణేశ్వరి, డా.వి.పెర్సిస్, ఈసీ మెంబర్ డా.బి.జగన్మోహనరెడ్డి, డీన్స్ ఆచార్య పి.సురేష్ వర్మ, ఆచార్య వై.శ్రీనివాసరావు, డా.కె.నూకరత్నం, డా.కె.వి.స్వామి, డా.కె.శామ్యుల్ పీటర్ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comment here