Andhra PradeshEast GodavariNews

టేకి ప్రగతి పబ్లిక్ స్కూల్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

టేకి ప్రగతి పబ్లిక్ స్కూల్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:మండల పరిధి పలు గ్రామాలలో సోమవారం  కృష్ణాష్టమి వేడుకలుఘనంగా నిర్వహించారు.గ్రామాలలో వైష్ణవ ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు.సాయంత్రం ఆలయాల వద్ద సంప్రదాయబద్ధంగా  ఉట్టూ కొట్టే ఉత్సవాన్ని వైభవంగా జరిపారు.టేకి గ్రామం ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు ధరించిన శ్రీ కృష్ణ గోపిక వేషధారణలు ఆకట్టుకున్నాయి.పాఠశాల కరస్పాండెంట్ నెక్కంటి బుచ్చి రామారావు మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలలో శ్రీ కృష్ణాష్టమికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.పండుగల విశిష్టతను తెలుపుతూ చిన్నారులచే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.   కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comment here