Andhra PradeshEast GodavariNews

డస్ట్ బిన్లు పంపిణీ -గుడాల ప్రసాద్ ఆదిలక్ష్మి

పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ( క్లాప్స్)
స్వచ్ఛ రాజమహేంద్రవరం – శ్రేష్ఠ
డస్ట్ బిన్లు పంపిణీ -గుడాల ప్రసాద్ ఆదిలక్ష్మి
రాజమహేంద్రవరంలో భాగంగా ఈరోజు స్థానిక 47 వ (క్రొత్త 49) వార్డు నందు తడి చెత్త పొడి,పొడి చెత్త, హానికర పదార్థాలు విడివిడిగా వేసుకొని మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా తద్వారా మన ఆరోగ్యం శుభ్రంగా ఉండే విధంగా ప్రజల యొక్క సౌకర్యార్థం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు  మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషిక్త్ కిశోర్  ఆలోచనలతో ప్రజల ఆరోగ్యం కోసం, స్వఛ్చ రాజమహేంద్రవరం కోసం ఏర్పాటు చేసినటువంటి 3 డబ్బాలను(గ్రీన్,బ్లూ,రెడ్) రాజమహేంద్రవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి
గుడాల ప్రసాద్ రాజమహేంద్రవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి గుడాల ఆదిలక్ష్మి చేతుల మీదుగా స్థానిక ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గుడాల ప్రసాద్ మాట్లాడుతూ ఈ 3 డబ్బాల యొక్క ప్రత్యేకతలను వివరిస్తూ ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని ఈ డబ్బాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పరిసరాలను శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని తద్వారా మన ప్రదేశాన్ని మన రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రంగా ఉంచేవిధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్ సిపి  నాయకులు భీమన వెంకటరమణ గౌడ్, వార్డు శానిటేషన్ సిబ్బంది శివ, శంకర్, రమణ, మరియు వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Comment here