Andhra PradeshEast GodavariNews

తాళ్ళారేవులో భారీగా పట్టుబడ్డ యానం మద్యం సీసాలు..

తాళ్ళారేవులో భారీగా పట్టుబడ్డ యానం మద్యం సీసాలు…..
జిల్లా ఎస్పీ ఏం రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా సబ్ టాస్క్ ఫోర్స్ నిరంతరం నిఘా వివిధ రకాల సమాచారం ద్వారా అక్రమ మద్యం రవాణాను అరికట్టే దిశలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సబ్ అసిస్టెంట్ కమిషనర్ జయరాజు పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ స్పెక్టర్ బీ వెంకటేస్వర్రావు, ఎస్ ఐ కె. విజయ్ కుమార్, బృందం పక్క సమాచారంతో మట్లపాలెం గ్రామానికి చెందిన పెమ్మడి దుర్గ ఇంటిలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో దొనం జాన్ అనే అసామీ ఇంట్లో పెమ్మడి దుర్గ 1230 యానం మద్యం సీసాలు నిలువ ఉంచినది మొత్తం )(1178-సీసాలు, 48- పిట్స్, 4-క్వార్టర్స్) పోలీసులు స్వాధీనం చేసుకుని ఇరువురుని అరెస్ట్ చేసి కస్టడిలోకి తీసుకోవడం జరిగిందన్నారు .వీటి విలువ యానాం లో 150000, ఆంధ్ర రాష్ట్రంలో వీటి విలువ సుమారు 300000 ఉండొచ్చని అంచనా. దాడిలో పాల్గొని ఇంత పెద్ద మొత్తంలో అక్రమ మద్యం పట్టుకున్న ఎస్ ఈ బి అధికారులను జిల్లా ఎస్ పి ప్రత్యేకంగా అభినందించారు.

Comment here