Andhra PradeshEast GodavariNews

త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:మండలంలో కేటాయించిన జగనన్న కాలనీలలో నిర్దేశించిన గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని మండపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి.పుష్ప మణి పేర్కొన్నారు.శుక్రవారం ఆమె మండలంలోని తాతపూడి,కపిలేశ్వరపురం,కోరుమిల్లి,మాచర గ్రామాలలో  జగనన్న కాలనీల లేఅవుట్లను  సందర్శించి అధికారులకు  పలు సూచనలు సూచించారు.గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు కూడా ఆమె సందర్శించారు.ప్రత్యేక అధికారి వెంట తహసిల్దార్ కే.దుర్గారావు,ఈఓపిఆర్ డి రామకృష్ణారెడ్డి,ఏపీఓ కవిత,సిబ్బంది ఉన్నారు.

Comment here