Andhra PradeshEast GodavariNews

దసరా ఉత్సవాల్లో కోవిడ్‌ నిబంధనలను పాటించాలి

దసరా ఉత్సవాల్లో కోవిడ్‌ నిబంధనలను పాటించాలి

` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
ఫొటో : 30టిపిజి03 : తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ముత్యాలమ్మవారి దసరా ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ……
కోస్తా ఎన్‌కౌంటర్‌ తాడేపల్లిగూడెం : దసరా ఉత్సవాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారి దసరా శరన్నవరాత్ర మహోత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 16వ తేది వరకు ముత్యాలమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కరోనా నియమావళిని ప్రతీ ఒక్కరూ పాటించి దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్‌ మాకా బాలాజీ, మేనేజర్‌ నామా సూర్యప్రకాశరావు, వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, ముప్పిడి సంపత్‌కుమార్‌, కొల్లాటి బాలాజీ, ఏఎంసీ డైరెక్టర్‌ కోడే కాశి, ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Comment here