Andhra PradeshEast GodavariNews

దిశా ఆప్ ద్వారా విద్యార్థినులకు పటిష్టమైన భద్రత

* దిశా ఆప్ ద్వారా విద్యార్థినులకు పటిష్టమైన భద్రత *
మహిళల భద్రతకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పోలీసు శాఖ వారు ప్రవేశ పెట్టిన దిశా ఆప్ ద్వారా ఆయ కళాశాలలో చదువుచున్న విద్యార్థినులకు  పటిష్టమైన భద్రత లభిస్తుందని రాజమహేంద్రవరం ఒన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద రాజు అన్నారు. స్థానిక దానవాయ పేట  లొని గల నివ్య ఒకేషనల్ జూనియర్ కాలెజి లొ విద్యార్హుల భద్రత మరియు దిశా ఆప్ యొక్క ప్రాముఖ్యత మీద దిన. 07.10.2021 న అవగాహన సదస్సు జరిగినది. ఈ కార్యక్రములో రాజమహేంద్రంవరమ్ దిశా పోలీస్ స్టేషన్ సి ఐ గౌస్ బైగ్ మరియు రాజమహేంద్రవరం ఒన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద రాజు ముఖ్య అధితిలు గ పాల్గొన్నారు. సి.ఐ గౌస్ బైగ్ మాట్లాడుతు విద్యార్థులు యొక్క ఎదుగుదలకు  చదువుతొ పాటు క్రమశిక్షణ కూడ చాల ముఖ్యమని అన్నారు. విద్యార్థులందరూ దిశా ఆప్ తమ సెల్ ఫోన్ లో కచ్చితముగా ఇన్స్టాల్ చేయాలనీ సూచించారు. ఈ దిశా ఆప్ సెల్ ఫోన్ ఉండుట ద్వార విద్యార్థినులు పలు ప్రమాదముల నుండి తప్పించు కొనుటకు అవకాశం వంటుందని తెలిజేశారు.  ఈ కార్యక్రమమునకు నివ్య కళాశాల డైరెక్టర్ పి. ఎర్నెస్ట్ మోజెస్ అధ్యక్షత వహించగా దిశా పోలీస్ స్టేషన్ స్.ఐ రేణుక ఉమెన్ ప్రొటెక్షన్ సభ్యులు ప్రియదర్శిని , సిరి చందన , పార్వతి మరియు నివ్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు

Comment here